తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రాజమౌళి ఎంత గొప్ప ఫిలిం డైరెక్టర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. ఇక ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ అనే పేరును కూడా సంపాదించారు. ఈ సమయంలోనే రాజమౌళి యొక్క గొప్పతనంలో విదేశీ గడ్డ పైన కూడా చాటిన చిత్రం RRR. ఈ సినిమా తాజాగా వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ పైన స్ట్రిమింగ్ అయ్యింది.ఈ సినిమా రాజమౌళి స్థాయిని మళ్లీ పెంచిందని చెప్పవచ్చు. బియాండ్ ఫేస్టులో భాగంగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒక ప్రదర్శనలో రాజమౌళి సైతం పాల్గొనడం జరిగింది. అప్పటికే ఈ చిత్రాన్ని ప్రపంచం మొత్తం నెట్ ఫిక్స్ తో పాటు వాళ్ళు ఓటిటి సంస్థలలో ప్రేక్షకులు చూశారు.


అయినా కూడా తాజాగా విడుదలైన చోట పెద్ద ఎత్తున జనాలు కూడా హాజరయ్యారు కేవలం ఒక్క చోటనే దాదాపుగా రూ. 17 లక్షల  రూపాయలు వసూలు నమోదు అయ్యిందని సమాచారం. ఈ సినిమా స్ట్రిమింగ్ అయిన తర్వాత రాజమౌళికి దక్కిన గౌరవం చాలా అద్భుతమని చెప్పవచ్చు. సినిమా పూర్తి అయిన తర్వాత ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడేందుకు గాను స్క్రీన్ మీదకు రాజమౌళి పిలిపించడం జరిగిందట. ఆ సమయంలో ఆయనకు గౌరవిస్తూ ఆయన్ని అభినందిస్తు ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చోని క్లాప్స్ కొట్టడం జరిగింది.


దీంతో ఏ ఒక్క ఇండియన్ డైరెక్టర్కు కూడా ఇలాంటి అరుదైన ఘనత దక్కలేదని చెప్పవచ్చు. ఇలాంటి ఘనత కేవలం రాజమౌళికే దక్కిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఈ సినిమాలోని ప్రతి షాట్ కూడా నిజంగానే ఒక అద్భుతం లా అనిపించింది అని చెప్పవచ్చు.అందుకే రాజమౌళి విదేశీ గడ్డపై కూడా తన స్టామినా చూపించాడు అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు రాజమౌళి.

మరింత సమాచారం తెలుసుకోండి: