మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆఖరి 4 మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా ,  ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు  సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ ,  నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ నిన్న అనగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12.97 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.50 కోట్ల కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.


ఆచార్య మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించగా ,  రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 38.75 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో  తమన్నా , నయన తార హీరోయిన్ గా నటించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి వి వినయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 23.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ,  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: