సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ప్రతి సినిమాలోని హీరో హీరోయిన్లు చిన్నప్పటి పాత్రలలో నటించడం కోసం చైల్డ్ ఆర్టిస్టులు ముఖ్యమైన పాత్రధారులు గా ఉంటారు.


ఈ క్రమంలోనే ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్టులే పెద్దవారిగా మారి సినిమాలలో కూడా నటిస్తున్నారు.


ఇప్పుడిప్పుడే కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమాలలో కూడా అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన చైల్డ్ ఆర్టిస్టులు అప్పట్లోనే వారు కనుమరుగయ్యారు. కానీ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్టులు అతి తక్కువ సమయంలో సినిమాలలో కూడా అడుగుపెడుతున్నారు. ఇప్పటికే చాలామంది సీరియల్ చైల్డ్ ఆర్టిస్టులు స్టార్ హీరోల సినిమాలలో అది కూడా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు.


చాలా వరకు హీరోయిన్స్ చిన్నప్పుడు పాత్రలలో కూడా నటిస్తున్నారు. ఇక ఇటీవలే బింబిసారలో సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ నటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి బాగా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాలో చిరంజీవి, నయనతార నటీనటులుగా నటించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు.


ఇక సత్యదేవ్ కంచరాన, గద్దర్, గంగవ్వ, అనసూయ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో నయనతార పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే నయనతారను డైరెక్టర్ చిన్నప్పుడు పాత్రలో కూడా చూయించాడు. ఇక ఆ పాత్రలో సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్.. రిధి గుత్తా నటించిన విషయం తెలిసిందే. చాలావరకు రిధి గుత్తా అంటే ఎవరికి తెలియదు. కానీ స్టార్ మాలో ప్రసారమవుతున్న దేవత సీరియల్ లో చిన్మయి అంటే ఎవరైనా గుర్తుపడతారు. అందులో మాధవ్ కూతురుగా చిన్నయి పాత్రలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంది రిధి. అలా ఈ చిన్నారికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చింది. అలా గాడ్ ఫాదర్ సినిమాలో తన నటనతో మరింత ప్రేక్షకాధారణ పొందింది. ఇక అందులో తన నటనను చూసి చాలా మంది ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు అని తెగ సెర్చ్ లు కూడా చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: