వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న
వరుణ్ తేజ్ కు బ్రేకులు వేసింది గని సినిమా. ఆ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం అలరించకపోవడంతో ఒక్కసారిగా ఆయనకు ప్లాప్ వచ్చి చేరినట్లు అయింది. అంతకుముందు ఆయన చేసిన వరుస సినిమాలు థియేటర్లలో మంచి ఫలితాలను రాబట్టుకున్నాయి. మంచి వసూళ్లను కూడా అందుకున్నాయి. ఈ నేపథ్యంలో
వరుణ్ ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన గని
సినిమా ప్రేక్షకులను ఆదరించకపోవడం నిజంగా ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేసింది అనే చెప్పాలి.
ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో చేయబోతున్న
వరుణ్ ఒక దర్శకుడితో కలిసి
సినిమా చేయాలని గతంలో భావించాడు. ఆయనే
ప్రవీణ్ సత్తారు. ఈ దర్శకుడు తో కలిసి
వరుణ్ తేజ్
సినిమా చేయాలని చాలా రోజుల క్రితమే డిసైడ్ అయింది కానీ
నాగార్జున ది గోస్ట్
సినిమా షూటింగ్లో పాల్గొంటున్న
ప్రవీణ్ సత్తార్ కు సమయం దొరక్క పోవడంతో ఆ చిత్రాన్ని ఇప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇటీవలే
దసరా కానుకగా గోస్ట్
సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. అయితే అనుకున్న స్థాయిలో ఈ
సినిమా ఆడలేదని చెప్పాలి. ఇందులో ముఖ్యంగా కథ యొక్క బ్యాక్ డ్రాప్ ఉండడంతో ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేకపోయారు
కారణం ఏదైనా కూడా
ప్రవీణ్ సత్తారు పైనే ఈ
సినిమా యొక్క ఫ్లాప్ ప్రభావం బాగా పడిందని చెప్పాలి. ఈ
సినిమా యొక్క ఫలితం ఆయన తదుపరి సినిమాలపై ఉంటుంది అని చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ.
వరుణ్ తేజ్ తో చేయవలసిన సినిమాను మధ్యలోనే డ్రాప్ చేసేందుకు సిద్ధమయ్యారట నిర్మాతలు.
హీరో కూడా
ప్రవీణ్ తో కలిసి ఈ
సినిమా చేయడానికి ఇష్టంగా లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు మళ్ళీ ఎవరితో
సినిమా చేస్తాడా అనేది చూడాలి. గరుడ వేగ సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు మరొకసారి భారీ విజయాన్ని అందుకోవాల్సిన
సినిమా చేయవలసి ఉంది.