టాలీవుడ్ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు ప్రతి ఒక్క హీరోయిన్ నోటి నుండి వినిపిస్తున్న మాట. చాలామంది ఫేడవుట్ అయిన హీరోయిన్లు ప్రస్తుతం కొన్ని ఇంటర్వ్యూల ద్వారా ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చాలా ధైర్యంగా నే చెబుతున్నారు


ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం పేరు చెప్పకుండా వారి బాధను బయటపెడుతున్నారు. ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ వలలో ఎంతో మంది హీరోయిన్లు పడ్డారు. ఇంకొంతమంది మాత్రం చాలా సింపుల్ గా కాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకొని పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు.


ఇక మరికొంతమంది అయితే స్టార్డం తెచ్చుకోవడానికి కమిట్మెంట్ లు కూడా ఇస్తూ వస్తున్నారు. ఇక అలా కమిట్మెంట్ ఇచ్చినవారిలో చాలా తక్కువ మంది తమకు జరిగిన అన్యాయం గురించి దైర్యంగా మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఎవరి ఇష్టం వాళ్ళది అన్న తీరుగా మాట్లాడుతూ అందులో తప్పేముంది అని చెబుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారు చేసేవాణ్ని చెత్త పనులు మాట్లాడే మాటలు నీతి వాక్యాలు అన్నట్లుగా మారిపోయింది సినీ ఇండస్ట్రీలోకొంతమంది పరిస్థితి. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై క్యారెక్టర్ ఆర్టిస్టు శిరీష ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందట.. శిరీష మాట్లాడుతూ.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ అయిపోయింది.


ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లకు అవకాశాలు ఇస్తామని చెప్పి, చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వారిని లొంగదీసుకుంటున్నారు. వారి శృంగార వాంఛలు తీరగానే అవకాశాలు ఇవ్వకుండా వదిలేస్తున్నారు. ఇక అలా వారి కామవాంఛ తీర్చుకొని కొంతమంది దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్లకు ఛాన్స్ లు ఇస్తే, మరికొంతమంది మాత్రం ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారట . అలాగే ఇండస్ట్రీలో నన్ను కూడా చాలామంది కమిట్ మెంట్ లు అడిగారు. అయితే సినిమాల్లో రాణించాలనే కోరికతో నేను ఎంతోమంది కోరికలను తీర్చాను. నేను వారి కామ వాంఛను తీర్చాను.చాలామంది పక్కలో పడుకున్నాను. కానీ వారందరూ ఇప్పుడు కనీసం ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. వారి కోరికలు తీర్చుకొని నన్ను చాలా మోసం చేశారు అంటూ శిరీష ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇండస్ట్రీపై శిరీష చేసిన కాస్టింగ్ కౌచ్ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: