ఈమధ్యకాలంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది చిరకాల కోరికగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఇల్లు ఉంటే ప్రతి ఒక్కరు ఎంతో భారం దిగిపోయిన అంతగా ఫీల్ అవుతూ ఉంటారు.ఇక టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఇల్లు ఇంద్రభవనాలను తలపిస్తుంటాయి. అంతేకాదు కోట్లు వెచ్చించి మరీ తమకు నచ్చినట్టుగా చాలా అందంగా భవనాలను నిర్మించుకుంటూ ఉంటారు. అంతేకాదు అన్ని కోట్లు పెట్టి కట్టుకున్న ఇంట్లో అదృష్టంగా భావిస్తారు కూడా.. కానీ కొంతమంది ప్రముఖులు మాత్రం ఇంద్ర భవనాలు లాంటి ఇల్లు ఉన్నా.. ఆ ఇంటిని వదిలి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. వీరిని చూసి తెలుగు ప్రేక్షకులు సైతం ఎందుకు వీరికి ఈ కర్మ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే విలాసవంతమైన ఇంద్ర భవనాలను వదిలి అద్దేకుంటున్న ఆ టాలీవుడ్ ప్రముఖుల గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

మహేష్ బాబు:మహేష్ బాబుకి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో అతిపెద్ద భవనం ఉంది. కానీ మహేష్ బాబు ఇప్పుడు అందులో ఉండడం లేదు. హైదరాబాద్లోని ఒక కాలనీలో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఎదురింటిలోనే ఆయన సోదరీ కూడా అద్దెకు నివసిస్తున్నారు.

నాగచైతన్య:
నాగచైతన్య అబిడ్స్ మాల్ వద్ద ఉండే ఒక సాధారణ ప్లాట్ లో నివాసం ఉంటున్నారు. విడాకుల తర్వాత తన సొంత ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. అయితే పెళ్లయిన తర్వాత సమంతతో కలిసి ఆ ఇంట్లోనే ఉన్నారు. అందుకు ఒక ప్రధాన కారణం కూడా ఉందట. నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేసిందన్న సెంటిమెంట్ వల్లే ఆ ఇంటిని వదలడం లేదని సమాచారం.

పవన్ కళ్యాణ్:హైదరాబాదులోని నందగిరి హిల్స్ లో ఒక పెద్ద భవనం ఉంది. కొంతకాలం పాటు అక్కడే ఉన్న ఆయన మట్టి మీద మమకారంతో తన ఫామ్ హౌస్ కి మారిపోయారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమరావతిలో కూడా ఇప్పుడు ఒక ఇంటిని నిర్మించుకున్నాడు.

జగపతిబాబు:
హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి దగ్గరలో జగపతిబాబుకు పెద్ద భవనం ఉంది. కానీ ఆ ఇంటిలో ఆయన ప్రస్తుతం నివసించడం లేదు. భార్య పిల్లలతో కూకట్పల్లిలోని ఒక ఫ్లాట్ లో నివసిస్తున్నారు.

రాజమౌళి:
రాజమౌళి పెళ్లయినప్పటి నుంచి మణికొండ లో నివాసం ఉంటున్నారు. గతంలో ఈయన ఒక విల్లాలో ఉండేవారు. ఆ తర్వాత అద్దెకు ఇచ్చి మణికొండ లోనే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లో అద్దెకు నివసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: