బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ ప్రభాస్ కు డ్తెహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు..ఆయన ఎ రేంజ్ సినిమా చేస్తున్నాడో చూస్తున్నారు.కానీ,హిట్ అయ్యిందా లేదా అనేది మాత్రం పెద్దగా పట్టించుకోలేదు.. అందులోనూ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలను ఎక్కువగా చేస్తున్నారు.యాక్షన్ సన్నీ వేశాలు వున్న సినిమాలే ఎక్కువగా చేస్తూ టాలివుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ కు ఎదిగాడు.. రేంజ్ పెరిగే కొద్ది ట్రోల్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి.సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ ను అవమానించేలా పోస్ట్ లు పెడితే ఫ్యాన్స్ అసలు ఊరుకోరు.



ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్ లో నెట్ ఫ్లిక్స్ సంస్థను ఆడేసుకుంటున్నాడు. అసలేం జరిగిందంటే.. 'సాహో' సినిమాలో ప్రభాస్ కొండమీద నుంచి లోయలోకి దూకే షాట్ ఒకటి ఉంటుంది.దాన్ని ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్.. 'ఇదేం యాక్షన్..?' అంటూ వెటకారంగా ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ పెట్టింది నెట్ ఫ్లిక్స్ ఇండోనేషియా విభాగం. ఇండోనేషియా భాషలోనే ఆ క్యాప్షన్ పెట్టారు. దీన్ని గూగుల్ లో అనువదించి చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. 'సాహో' సినిమాను, ప్రభాస్ ను కించపరుస్తున్నట్లుగా ఉండడంతో నెట్ ఫ్లిక్స్ పై యుద్ధం ప్రకటించారు.



 'అన్‌సబ్‌స్క్రైబ్ నెట్ ఫ్లిక్స్' అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకుంటున్నట్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇది నెట్ ఫ్లిక్స్ కి పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. ప్రభాస్ లాంటి స్టార్ హీరోని నెట్ ఫ్లిక్స్ టచ్ చేయకుండా ఉండాల్సింది. బహుశా.. ఇండోనేషియా విభాగానికి ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసి ఉండదు. అందుకే ఇలా వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టి సంస్థపై ఎఫెక్ట్ పడేలా చేసింది..సాహో ప్లాప్ అయ్యినప్పటికీ మంచి కలెక్షన్లను రాబట్టింది..ప్రస్తుతం ఆయన నటించిన 'ఆదిపురుష్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వీఎఫ్ఎక్స్ పై మరింత దృష్టి పెట్టడంతో సినిమా రిలీజ్ ఆలస్యమయ్యేలా ఉంది. కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇది కాకుండా.. 'సలార్', 'ప్రాజెక్ట్ K' వంటి సినిమాల్లో నటిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: