మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య రాజేష్ తమిళ మూవీ ల ద్వారా మంచు గుర్తింపు ను దక్కించుకుంది. ఈ ముద్దు గుమ్మ కౌసల్య కృష్ణమూర్తి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ తన నటన తో ప్రేక్షకులను బాగానే అల్లరించినప్పటికీ , ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. దానితో కౌసల్య కృష్ణమూర్తి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. 

కౌసల్య కృష్ణమూర్తి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి అవకాశాలే దక్కాయి. అందులో భాగంగా అనేక తెలుగు మూవీ లలో నటించిన ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఐశ్వర్య రాజేష్ పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఐశ్వర్య రాజేష్ తన ఇన్స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఐశ్వర్య రాజేష్ తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లలో బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఇలా ఐశ్వర్య రాజేష్ అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: