అక్కినేని
నాగచైతన్య హీరోగా
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ
సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాలో కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తుం ది. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ
సినిమా తొందరలోనే పూర్తి కాబోతుంది అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృం దం సన్నాహాలు చేస్తుంది. తమిళనాడు లో మంచి దర్శకుడిగా వెరైటీ చిత్రాలు చేసే
డైరెక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు
వెంకట్ ప్రభు.
అలాంటి ఈ దర్శకుడు నుంచి రాబోతున్న తొలి
సినిమా కావడం చిత్రంపై ఇంతటి అంచనాలు పెరగడానికి కారణం అవుతుంది. ఆయన ఇటీవలే చేసిన
సినిమా మానాడు భారీ విజయం అందుకోవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అందులో భాగంగా ఒక వెరైటీ కాన్సెప్ట్ తో
సినిమా చేస్తున్న ఈ దర్శ కుడు ఈ
సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని అందుకొని తెలుగులో మంచి దర్శకుడిగా ఎదుగుతాడు అనేది చూడాలి.
అయితే
నాగచైతన్య ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయాలి అన్నదానిపై ఎంతో క్లారిటీగా ఉన్నాడట. ఇప్పటిదాకా పలు సినిమాలతో కలిసి తన సినిమాలను విడుదల చేసిన చైతు ఈ సినిమాను సోలోగా విడుదల చేసి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడట. కలెక్షన్ పరంగా కూడా మెరుగుపడాలి అంటే తప్పకుండా ఈ సినిమాను సోలోగా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడట. తొందరలోనే ఈ చిత్రం యొక్క విడుదలపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రం మంచి విజయం అందుకోవడం మాత్రమే కాదు తప్పకుండ వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవాలి అని అయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి అంతటి సత్తా ఈ
సినిమా కలిగి ఉంటుందా అనేది చూడాలి. ఇప్పటివరకు వచ్చిన అవుట్ పుట్ పట్ల యూనిట్ ఎంతో నమ్మకంగా ఉందని తెలుస్తుంది.