ఈ నేపథ్యంలోని ఒక ప్రముఖ టీవీ ఛానల్ కూడా రష్మిక ప్రవర్తనపై మండిపడుతూ.. ఆమె కావాలని సినిమా చూడలేదు అన్నట్టుగా ప్రచారం చేసింది. అంతే కాదు రష్మిక నిశ్చితార్థం చేసుకోని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న రక్షిత్ శెట్టి తమ్ముడే ఈ రిషబ్ శెట్టి.. రిషబ్ శెట్టి నుంచి సినిమా రావడం కారణంగానే ఆమె ఈ సినిమా చూడలేదు అంటూ కూడా వార్తలను చిత్రీకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మిక మొదటిసారి ఒక లాంగ్ నోటు విడుదల చేసి తనపై ఎందుకు ఇంత కుట్ర పన్నుతున్నారు .. అనే విషయం వెల్లడిస్తూ మరింత ఎమోషనల్ అయింది . కానీ ఎట్టకేలకు అసలు విషయం తెలుసుకున్న ఆ ప్రముఖ టీవీ ఛానల్ రష్మికకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పింది.
టీవీ ఛానల్ అయితే రష్మికకు క్షమాపణలు చెప్పింది కానీ కన్నడ ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ ఆమెపై పగతో ఉన్నారని స్పష్టం అవుతోంది. మరొకవైపు విజయ్ దేవరకొండకు ఈమె డేటింగ్ చేస్తోందనే వార్తలపై కూడా ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం.