తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ ప్రస్తుతం తూనీవు అనే భారీ యక్షన్ ఎంటర్టైలర్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నో గన్స్ నో గ్లోరి అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి అజిత్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను విడుదల చేసింది. అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ గా మారాయి.

మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ విడుదల తేదీని మాత్రం చిత్ర బృందం ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల సమయం దగ్గర పడడంతో ఇప్పటికే తూనివూ మూవీ యూనిట్ ఈ సినిమా బిజినెస్ ను ప్రారంభించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తుని మూవీ యూఎస్ఏ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. తునివు మూవీ యూఎస్ఏ హక్కులను సరిగమ సినిమా సంస్థ దక్కించుకున్నట్లు , లైకా ప్రొడక్షన్స్ తో కలిసి ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే తునివు మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అజిత్ ఆఖరుగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తేరకెక్కిన వలిమై అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. మరి తునివు మూవీ తో అజిత్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: