పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన , ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో సినిమాల్లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు కథ ను కూడా అందించాడు. పవన్ కళ్యాణ్ తాను నటించిన జానీ మూవీ కి కథను అందించడం మాత్రమే కాకుండా , ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు.

అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ కి పవన్ కళ్యాణ్ కథను అందించాడు. ఇది ఇలా ఉంటే మరో సారి పవన్ కళ్యాణ్ తన మూవీ కి తనే కథ ను రాసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ దర్శకత్వం లో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ ని చేయబోతున్నట్లు గతంలోనే అధికారిక ప్రకటన చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఓ మూవీ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

కాకపోతే అది భవదీయుడు భగత్ సింగ్ మూవీ కాదు అని  ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొత్తగా ఒక కథ రాస్తున్నాడు అని , ఆ కథతోనే పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ మూవీ తెరకెక్కే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో ఒక వార్త అవుతుంది. మరి ఇది వరకు పవన్ కళ్యాణ్ కథతో తెరకెక్కిన రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాలను అందుకోలేదు. ఇది ఇలా ఉంటే ఈ వార్తకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: