‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రావడంలేదు. దీనితో అతడి ఫ్యాన్స్ లో టెన్షన్ విపరీతంగా పెరిగి పోతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ‘ఆదిపురుష్’ టీజర్ గ్రాఫిక్స్ వర్క్స్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అభిమానులను మరింత నిరుత్సాహపరిచాయి. దీనితో ఈ మూవీని నిర్మిస్తున్న టి సిరీస్ సంస్థ ఈ మూవీ గ్రాఫిక్ వర్క్స్ పై మరింత పెట్టుబడి పెట్టి ఆ గ్రాఫిక్ వర్క్స్ ను అందరికీ నచ్చేవిధంగా తీర్చిదిద్దాలని ఈ మూవీ విడుదలను జూన్ 16కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.


అయితే ఇప్పుడు ‘ఆదిపురుష్’ మూవీ విడుదల మరొకసారి వాయిదా పడుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు హోరెత్తి పోతున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఈ మూవీ నిర్మాతలు ఈ మూవీ గ్రాఫిక్ వర్క్స్ పై 5వందల కోట్లు ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి అమెరికాలో ‘అవతార్ 2’ మూవీకి గ్రాఫిక్స్ వర్క్స్ అందించిన రెండు ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.


ఆ కంపెనీల ప్రతినిధులు ‘ఆదిపురుష్’ మూవీని చూసి తాము గ్రాఫిక్స్ చేయించే విషయంలో హై క్వాలిటీ ఇవ్వడానికి తమకు కనీసం 9నెలలు సమయం కావాలని టి సిరీస్ సంస్థను అడిగినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఈ వార్తలను బట్టి ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జూన్ నుండి మళ్ళీ వాయిదా పడి 2024 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ మారబోతున్నట్లు తెలుస్తోంది.


దీనితో వచ్చే ఏడాది సెప్టెంబర్ 23న విడుదల కావలసి ఉన్న ‘సలార్’ అనుకున్న ప్రకారం విడుదల అవుతుందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. వాస్తవానికి ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నది కూడ ఇదే అనుకోవాలి. ‘అదిపురుష్’ పై కంటే అభిమానులకు ‘సలార్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ల కాంబినేషన్ కావడంతో ‘సలార్’ మరో ‘కేజీ ఎఫ్ 2’ అవుతుందని అభిమానుల అంచనా..


మరింత సమాచారం తెలుసుకోండి: