సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలి అంటే స్కిన్ షో చేయక తప్పదు. అలాంటిది మనందరికీ అంతో ఇంతో పద్ధతిగా ఉండే హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు కీర్తి సురేష్ .మహానటి సినిమాతో ఆడియన్స్ కు ఇంకా దగ్గర అయిపోయింది ఈమె. ఈ సినిమాతో అందరూ ఈమెను పద్ధతిగా ఉండే హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ మధ్య ఈ విషయంలో కీర్తి సురేష్ కాస్త మారింది అని చెప్పాలి .ఈమధ్య తోటి హీరోయిన్లతో పోటీగా ఎక్స్పోజింగ్ చేయడం మొదలు పెట్టింది .సోషల్ మీడియాలో ఈమెకి సంబంధించిన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంది .

అంతేకాదు ముఖ్యంగా మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో ఈమె నటన అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ లో కీర్తిని చూడాల్సి రావడం జనాలకు చాలా కొత్తగా అనిపించింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ ను మీకు క్యాస్టింగ్ ఎదురు అయిందా...? ఒకవేళ హీరోయిన్ అవ్వాలి అంటే కమిట్మెంట్ తప్పదు అని అంటే..మీరు ఏం చేస్తారు అని అడగ్గా దానికి ఈమె ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది .ఈ ప్రశ్నలకు సమాధానంగా కీర్తి సురేష్ ఒకవేళ అలాంటి పరిస్థితి కనక ఎదురైతే సినిమాలు మానేసి ఏదో ఒక జాబ్ చేసుకుంటా కానీ అలాంటి పని మాత్రం అస్సలు చేయను అంటూ  యాంకర్ మొహం మీదే చెప్పింది.

 కాస్టింగ్ కౌచ్ సినీ ఇండస్ట్రీలో ఉంది అని నాకు తెలుసు .సినీ ఇండస్ట్రీలో నాతోపాటు నటించే చాలామంది హీరోయిన్లకి ఇలాంటి సందర్భమే ఎదురయింది వారిలో చాలామంది ఈ ఇబ్బంది గురించి నాకు చెప్పారు .అది నా వరకు వస్తే అసలు చేసేదే లేదు... చచ్చిన కూడా అలాంటి పని మాత్రం నేను చేయను.. ఒకవేళ వస్తే నేను అసలు సినిమాలు చేసేదాన్ని కాదు. అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ఆమె ఫోటోలను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పై కొందరు ట్రోల్స్ కూడా చేయడం జరిగింది. ఇవేమీ పట్టించుకోని కీర్తి సురేష్ ఆమె హాట్ ఫోటో షూట్స్ చేసుకుంటూ పోయింది .దీంతో ఈ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: