పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వం లో సినిమా అయితే కన్ఫామ్ అయ్యింది. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్సినిమా కు షూటింగ్ కోసం డేట్లు కూడా ఇస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.

కానీ అసలు విషయం ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా తర్వాత కచ్చితం గా పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందబోతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం డేట్లు ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈ రెండు సినిమా లను పూర్తి చేసేలా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నాడు అనేది సమాచారం. ఒక వైపు బస్సు యాత్ర మొదలు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది.. మరో వైపు ఇలా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అంటూ ఆయన అభిమానులు గందరగోళానికి అయితే గురి అవుతున్నారు.

ఇంతకూ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా గా ఏ సినిమా ను అయితే తీసుకు వస్తాడు అనేది తెలియడం లేదు. హరిహర వీరమల్లు సినిమా ను వచ్చే సమ్మర్ లో ఏప్రిల్ నెల లో విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2023 సంవత్సరం లోనే మరో పవన్ కళ్యాణ్ నటించే మరో సినిమా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సినిమా ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఒక సమయం చూసుకొని సినిమాల్లో నటిస్తున్నాడు. భారీ పారితోషకం వస్తున్న కారణం గా సినిమా లను అయితే వదిలి పెట్టట్లేదు అనేది ఆయన సన్నిహితుల మాట. ఆయన ఆర్థిక అవసరాల కోసం వరుసగా సినిమా లను చేస్తూనే ఉన్నాడు. ముందు ముందు కూడా చేస్తాడు అంటూ ఆయన సన్నిహితులు అయితే మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: