ఇటీవల విడుదలైన కాంతార సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూవీ ఆఫ్ థి డికేట్ అని ఈ సినిమాని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాకి సంబంధించిన కథ కథనం  పరిగణలోకి తీసుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే రాజమౌళి లాంటి టాప్ దర్శకులు సైతం ఈ సినిమా గురించి ప్రశంసించడం జరిగింది .ఆయన ఆలోచనలు మార్చేసిన సినిమాగా ఈ సినిమాను వర్ణించారు. ఇక భారీ బడ్జెట్ స్టార్ హీరో లేకుండా కోట్లు వసూలు చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని ఆయన పేర్కొన్నారు. 

పెట్టుబడికి 20 రెడ్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక కేజీఎఫ్ నిర్మాతలు కాంతార సినిమాని కేవలం 16 కోట్లతో నిర్మించారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది .బడ్జెట్ తో పోల్చుకుంటే త్రిబుల్ ఆర్ సినిమాకి 10000 కోట్ల వసూళ్లు సాధించిన దానితో సమానం అని చెప్పవచ్చు. అందుకే రాజమౌళి సైతం ఈ సినిమా నన్ను మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ మధ్యకాలంలో ఈ సినిమా ఇచ్చినంత లాభం ఇండస్ట్రీకి ఏ సినిమా ఇవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు .ఇక తెలుగులో ఈ సినిమా విడుదల హక్కులు కేవలం రెండు కోట్లకు కొన్నారు.

30 కోట్లకు పైగా వసూళ్లు ఈ సినిమా సాధించింది. అయితే విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, బయర్ల జేబులు నింపిన ర ఈ సినిమాకి  రిషబ్ ఎంత రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికిగాను శెట్టి ఈ సినిమాకి అందుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన అంత తక్కువ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు .అయితే మొదట రిషబ్ శెట్టి రెమ్యూనరేషన్ 5.5 కోట్లు అనుకున్నారు. ఇక ఒప్పందం ప్రకారం అది ఇచ్చేశారు. దాని అనంతరం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో మరొక ఐదు కోట్లు రిషబ్శెట్టికి ఇచ్చారట. మొత్తంగా రిషబ్ శెట్టి 10.5 కోట్ల రూపాయలను ఈ సినిమాకి రెమినేషన్ గా తీసుకున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికదా వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: