టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది సమంత. ప్రస్తుతం సమంత వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.అయితే గత కొంతకాలంగా సమంత మయోసైటిస్ అని ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తన అనారోగ్యం కారణంగా సినిమాలకి గ్యాప్ ఇచ్చిన సమంత మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయింది. అయితే ఈ నేపథ్యంలోని సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న శకుంతలం సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

అయితే సాధారణంగా సినిమా షూటింగ్స్ లో వివిధ రకాల ఆభరణాలను ఉపయోగిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్స్ లలో ఎక్కడా కూడా నిజమైన బంగారాన్ని ఉపయోగించరు.. కానీ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న శకుంతలం సినిమా కోసం ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్సినిమా మేకింగ్ లో కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యత నిచ్చేలా నిజమైన బంగారు ఆభరణాన్ని ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నీ షూటింగ్లో ఉపయోగించిన ఆభరణాల విలువ ఎన్ని కోట్లు తెలిస్తే ఖచ్చితంగా మీరందరూ షాక్ అవుతారు... అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్లో ఉపయోగించిన బంగారు ఆభరణాల విలువ దాదాపు మూడు కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.

ఇక సమంతా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ పౌరాణిక ప్రణయ గాధ ఫిబ్రవరి 17వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకు స్టైలిష్ గా జాతీయ అవార్డు గ్రహీత నీతాలుల్ల వ్యవహరించింది. ఇకపోతే ఈ సినిమాలో సమంత ధరించిన నగలు నేహా అనుములు డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాలో యువరాణిగా శకుంతల పాత్రలో నటించిన సమంత సహజత్వం కోసం నిజమైన బంగారు ఆభరణాన్ని ఉపయోగించారు. అంతేకాదు ఈ సినిమాలో సమంత ధరించిన చీరను నిజమైన ముత్యాలు పొదిగి రూపొందించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ చీర 30 కేజీల బరువు ఉంటుందని తెలుస్తోంది. అయితే 30 కేజీల బరువు ఉన్న ఈ చీరను సమంత ఏకంగా ఏడు రోజులు షూటింగ్లో ధరించి పాల్గొన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: