పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస మూవీ లకు ఓకే చెప్పిన విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆఖరుగా సాకర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ లో రానా కూడా హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ , క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఏ  ఏమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ లో నిధి అగర్వాల్ , పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మే లేదా జూన్ నెలలో ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసి దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మొట్ట మొదటి సారి నటించిన పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అభిప్రాక్షకులను చాలా మేరకు ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత గా పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: