మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటువంటి సమంతా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఏం మాయ చేసావే మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుని అద్భుతమైన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా సమంత నటించిన సినిమాలు కూడా ఎక్కువ శాతం మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం కూడా సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత ... గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం అనే భారీ బడ్జెట్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది.

ఇది ఇలా ఉంటే  శాకుంతలం మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలే పెట్టుకున్నప్పటికీ ఈ మూవీ విడుదల అయ్యే తేదీనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న రెండు డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ఏప్రిల్ 14 వ తేదీన రాఘవ లారెన్స్ హీరోగా రూపొందిన రుద్రుడు మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ పై కూడా తెలుగు ప్రేక్షకులకు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన బిచ్చగాడు 2 మూవీ కూడా విడుదల కాపుతుంది. ఈ మూవీ పై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు మూవీ లతో పోటీని తట్టుకొని సమంత "శాకుంతలం" మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: