నాచురల్ స్టార్ నాని ఆఖరుగా అంటే సుందరానికి మూవీbతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించక ... మలయాళ ముద్దు గుమ్మ నజ్రియా ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదల ముందు ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచారం చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టు కోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాని "దసరా" అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం, హిందీ భాషలలో ఒకే తేదీన విడుదల చేనున్నారు.  శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ధూమ్ ధాం అనే పాటను విడుదల చేసింది. ఈ పాటకు మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా లోని ధూమ్ ధామ్ వీడియో సాంగ్ లాంచ్ ఈవెంట్ ను రేపు ముంబై లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: