నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నాని ఆఖరుగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన అంటే సుందరానికి మూవీ తో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాని కొత్త దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఒదల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించాడు.

కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మార్చి 30 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో నాని ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

ఇది ఇలా ఉంటే తాజాగా దసరా మూవీ కోసం నాని తీసుకున్న రెమ్యూనరేషన్ ఇదే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... నాని దసరా మూవీ కంటే ముందు చేసిన సినిమాకు 15 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకోక ... ఈ మూవీ కి మాత్రం 22 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే నాని కి ఉన్న క్రేజ్ కు ఆ మాత్రం రెమ్యూనిరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: