మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో అద్భుతమైన గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ "దాస్ కా దమ్కీ" అనే పవర్ఫుల్  మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాలో విశ్వక్ సరసన హాట్ బ్యూటీ నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఇది వరకు వీరిద్దరి కాంబినేషన్ లో పగల్ మూవీ రూపొందింది.

ఇది వీరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు భాషలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 14 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని హిందీ భాషలో కూడా విడుదల చేయనున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ని థియేటర్ లలో ఏప్రిల్ 14 వ తేదీ విడుదల చేయనున్నారు. మరి ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అల్లరించిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: