తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించిన రామ్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం రామ్ ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 21 తేదీన విడుదల చేయనున్నారు.

 ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నీ బోయపాటి పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రామ్ ... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో పొందబోయే మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం అక్టోబర్ నెల నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో ఈస్మార్ట్ శంకర్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో  ఈస్మార్ట్ శంకర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: