రెండు జడలు వేసుకుని స్కూల్ లో ఏదో ప్రైస్ అందుకుంటూ ఈ ఫోటోలో ఒక చిన్నారి కనిపిస్తుంది. అయితే ఇలా ఈ ఫోటోలో కనిపించిన చిన్నారి ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా ఛాన్సులు దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఇక ఇప్పుడు బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అంతేకాదు వైవిద్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ బ్యూటీ. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తాప్సి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది తాప్సి. ఇక ఆ తర్వాత ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలు సరసన ఛాన్స్ కొట్టేసింది. అయితే ఆ తర్వాత మాత్రం తెలుగు ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో వివాదాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటుంది. గతంలో సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ చేసిన కామెంట్స్ కి కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి అని చెప్పాలి.
ఝుమ్మంది నాదం సినిమా తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, వీర, దరువు, మొగుడు, గుండెల్లో గోదారి లాంటి సినిమాల్లో టాలీవుడ్ లో నటించింది. ఇక ఆ తర్వాత చశ్మె బద్దూర్ అనే సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. తర్వాత పూర్తిగా బాలీవుడ్ కి మకామ్ మార్చేసి అక్కడే వరస సినిమాలు చేస్తుంది. చేతినిండా సినిమాలు ఉండడంతో మళ్ళీ ఈ అమ్మడికి టాలీవుడ్ వైపు చూసే అవసరం రాలేదు అని చెప్పాలి. మరోవైపు తమిళ భాషలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇలా తాప్సికి సంబంధించి చిన్నప్పటి ఫోటో చూసి ప్రస్తుతం ఫాన్స్ షాక్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి