
జీవితంలో ఒక్కొక్కరికీ ఒక్కో కథ ఉంటుంది. ప్రతీ కథలోనూ హృదయాలను కదిలించే భావోద్వేగం ఉంటుంది. అలాంటి సుమతి అనే ఓ ఎమోషనల్ అండ్ బోల్డ్ క్యారెక్టర్లో మెప్పించనుంది అనసూయ భరద్వాజ్ అని తెలిపారు. ఈ సందర్భంగా విమానం మూవీ మేకర్స్ సుమతి పాత్రకు సంబంధించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో ఆమె అందంగా రెడీ అవుతుంది. అసలు ఆమె అలా రెడీ కావటానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
‘విమానం’ చిత్రంలో వీరయ్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్రలో సముద్రఖని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. అసలీ పాత్రల మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది ఈ సినిమా.
ఓ చిన్న కుర్రాడు..అతనికి విమానం ఎక్కాలని ఎంతో ఆశ.. కానీ ఎలా? ఎప్పుడు విమానాన్ని చూసినా అలా ఆనందం, ఆశ్చర్యంతో చూస్తూనే ఉండిపోతాడు. తన కోరికను తండ్రికి చెబితే బాగా చదువుకుంటే విమానం ఎక్కవచ్చునని చెబుతాడు. అంగ వైకల్యంతో బాధపడే తండ్రి వీరయ్య ఎలాంటి కష్టం తెలియకుండా తల్లి లేని కొడుకుని పెంచుకుంటుంటాడు. మరి ఆ పిల్లాడి కోరిక తీరిందా? తండ్రి చెప్పినట్లే ఆ పిల్లాడు విమానం ఎక్కాడా? అనే సంగతి తెలుసుకోవాలంటే జూన్ 9 వరకు ఆగాల్సిందే.