
ఈ చిత్రం లో బాలయ్య తన కూతురు కోసం చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకొని 20 ఏళ్ళు జైలు జీవితాన్ని గడిపి వస్తాడట. సినిమా మొత్తం బాలయ్య మార్కు మాస్ సన్నివేశాలు మరియు ఎలివేషన్స్ ఉంటాయి కానీ, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ని మాత్రం ఆశించొద్దు అని అంటున్నారు ఈ సినిమాలో పని చేస్తున్న కొంతమంది యూనిట్ సభ్యులు. అనిల్ రావిపూడి సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజి ఉంది. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలన్నీ కామెడీని ప్రధాన అంశంగా తీసుకొని తెరకెక్కించినవే. మొట్టమొదటి సారి ఆయన తన స్ట్రాంగ్ జోన్ ని వదిలి బయటకి వచ్చి ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు చేస్తున్నాడు. మరి బాలయ్య మాస్ ని అనిల్ రావిపూడి హ్యాండిల్ చేయగలడా, తనకి తెలియని జానర్ లో సక్సెస్ కాగలదా?, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే. ఇక జూన్ 10 వ తారీఖున బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతుంది మూవీ టీం. ఈ టీజర్ లో బాలయ్య మార్కు డైలాగ్స్ మరియు పవర్ ఫుల్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయట. ఇన్నేళ్ల బాలయ్య కెరీర్ లో ఎప్పుడూ కూడా తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పలేదు, అందువల్ల ఈ సినిమాలో బాలయ్య బాబు తెలంగాణ స్లాంగ్ ఎలా ఉంటుందో విందాం అని కేవలం బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య తోటి స్టార్ హీరోలైన చిరంజీవి, నాగార్జున మరియు వెంకటేష్ ఇది వరకే చాలా సినిమాలలో తెలంగాణ స్లాంగ్ ని వాడారు. ఇప్పుడు బాలయ్య వంతు వచ్చింది, రీసెంట్ గా తెలంగాణ స్లాంగ్ తో తెరకెక్కిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి, మరి 'భగవత్ కేసరి' చిత్రం కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి.