ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతుంది శ్రీలీల. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల  మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయమైన ఎంతో మంది హీరోయిన్లు ఇక దశాబ్ద కాలానికి పైగానే హవా నడిపించారు. ఇక ఇప్పుడు శ్రీలీలా కూడా ఇదే రీతిలో ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.


 సీనియర్ హీరోలు జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరూ సరసన చాన్సులు కొట్టేస్తుంది. ఒకవైపు తన అందం అభినయంతో ఆకట్టుకుంటూనే.. మరోవైపు తన డాన్సులు నటనతో కూడా తనకు తిరుగులేదు అని నిరూపిస్తుంది. మొన్నటికి మొన్న రవితేజ సరసన నటించి ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలోను కీలకపాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతుంది. అంతేకాదు చేతినిండా అవకాశాలతో బిజీబిజీగా ఉంది. ఇలాంటి సమయంలో శ్రీ లీల కోలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చేస్తుందట.


 సాధారణంగా హీరోయిన్లు మంచి పాపులారిటీ ఉన్నప్పుడే అన్ని భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటారు. కానీ శ్రీ లీల మాత్రం కోలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంది. అయితే ఈ అమ్ముడు ఇలా కోలీవుడ్ ఆఫర్స్ రిజెక్ట్  చేయడానికి కారణం ఇక కాల్ షీట్స్ కాళీ లేకపోవడమే అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం అటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, నితిన్, వైష్ణవ తేజ్ సినిమాల్లో ఆఫర్ కొట్టేసి బిజీబిజీగా ఉంది. దీంతో డేట్స్ ఖాళీ లేకపోవడంతోనే కోలీవుడ్ సినిమాలను రిజక్ట్ చేస్తుందట. మరి ఈ అమ్మడి కోలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అని అక్కడి ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: