ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... శర్వానంద్ లు హీరోలుగా నటిస్తున్న మూవీ ల షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ మూవీ లు ఏవి ..? ప్రస్తుతం ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్ ల వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ... శ్రీ లీల లను హీరోయిన్ లుగా ఎంపిక చేసుకున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితం ప్రకటించింది. కాకపోతే ఈ మూవీ నుండి శ్రీ లీల ను తీసివేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ రోజు నుండి ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో మహేష్ కూడా పాల్గొనబోతున్నాడు. హారిక అండ్ హాసినిక్ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ తాజా షెడ్యూల్ ఈ రోజు తో హైదరాబాద్ లో ముగియనుంది. ఈ మూవీ లో పవన్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు.

శర్వానంద్ ప్రస్తుతం తన కెరియర్ లో 35 వ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం శర్వానంద్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి పై ప్రస్తుతం సన్నివేశాలను రూపొందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: