అందుకే లావణ్య త్రిపాఠి హాట్ ఫోటో షూట్స్ ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వచ్చే ఏడాది ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా తో లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీ లో ఆమె కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మెగా ఫ్యామిలీ కి చెందిన నిహారిక సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఆమె హీరోయిన్ గా కూడా నటిస్తుంది. కనుక లావణ్య త్రిపాఠి కూడా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీ లో ఉంటుంది అంటూ మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది. మెగా ఫ్యాన్స్ ఎంత వరకు లావణ్య త్రిపాఠి సినిమా లను ఆధరిస్తారు అనేది చూడాలి. హాట్ ఫోటో షూట్స్ కి నో చెప్పిన మెగా ఫ్యాన్స్ వేరే హీరో లతో లావణ్య త్రిపాఠి రొమాన్స్ చేస్తే ఊరుకుంటారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి ఇండస్ట్రి నుండి తప్పుకుంటే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎలా అయితే లావణ్య త్రిపాఠి తగ్గించిందో.. అలాగే సినిమా ల్లో హాట్ సన్నివేశాలు మరియు స్కిన్ షో లు తగ్గించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి