సినీ ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా సపోర్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసినా ఏదైనా వేదికపై మాట్లాడిన భారీ స్థాయిలో నవ్వులు పూయిస్తూ మాట్లాడుతూ ఉంటారు.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈయన చేసినటువంటి ఒక పోస్ట్ తీవ్ర స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ఇంతకీ ఈయన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేశారు అనే విషయానికి వస్తే గతంలో తాను బోటు కొనుక్కోవాలి అనుకుంటున్నాను సూచనలు ఇవ్వండి అంటూ పోస్ట్ చేశానని అయితే దానిపై చాలా విమర్శలు వచ్చాయి అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్ హీరోగా స్లమ్ డాగ్ హస్బెండ్ అనే సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన ఈ విషయం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా తాను తన భార్య కారులో ప్రయాణిస్తున్నాము అప్పటికే వర్షం ఎక్కువగా రావడంతో ఇంటికి వెళ్లే దారులని నీటితో నిండిపోయాయి దాంతో తెలిసిన వారి ఇంట్లో కారు పెట్టి పక్కనే ఉన్న వంతెన మీదగా మా ఇంటికి చేరుకున్నాము. అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాకు సహాయం చేశారు. ఇదే విషయాన్ని తాను సెటైరికల్ గా బోటు కొనుక్కోవాలి అనుకుంటున్నాను అంటూ దానికి హైదరాబాద్ రెయిన్ అనే ట్యాగ్ చేశానన్నారు. అయితే ఈ విషయంపై తనని చాలామంది ట్రోల్ చేశారు. అప్పటికి నేను వివరణ ఇచ్చిన చాలామంది నన్ను ఆంద్రోడా అంటూ నాపై చిల్లర కామెంట్స్ చేశారని ఈ సందర్భంగా బ్రహ్మాజీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: