మనలో చాలా మంది జబర్దస్త్ షోకి పెద్ద ఫాన్స్. చూసినంతసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కడుపుబ్బా నవ్వుకునేలా చేస్తుంది ఈ షో. ఈ షోలో కమెడియన్లు చేసే స్కిట్లు చూస్తే టైమే తెలీదు. అరకొర సినిమాలు చేస్తూ, గుర్తింపు కోసం కష్టపడుతున్న ఎంతోమంది టాలెంటెడ్ కమెడియన్స్ కి కేర్ అఫ్ అడ్రస్ గా మారింది జబర్దస్త్. జబర్దస్త్ మొదలయ్యాక వాళ్ళ జీవితాలే మారిపోయాయి. ఈ షోలో కామెడియన్లకే కాదు..జడ్జెస్ కి కూడా ఫాన్స్ ఉంటారు. ఈ షోకి జడ్జెస్ గా వ్యవహరించిన రోజా, నాగబాబు, బుల్లితెర మీద ఎంత పేరు, అభిమానం సంపాదించుకున్నారో వేరేగా చెప్పనక్కర్లేదు. వీళ్లకు పారితోషకం కూడా మెండుగా ఉండేది.

ఈ షోకి ఇప్పుడు ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్, హీరోయిన్ ఇంద్రజ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఐతే వీళ్లకు పారితోషకం మాత్రం చాలావరకు తగ్గించారని తెలుస్తోంది.  నాగబాబు, రోజా కు ఒక్కో ఎపిసోడ్ కు ఐదు లక్షలు పారితోషకం అందేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కృష్ణ భగవాన్, ఇంద్రజ లకు మాత్రం పారితోషకం బాగా తగ్గించేసారట. ప్రస్తుతం వీళ్లకు ఒక ఎపిసోడ్ కు రెండున్నర లక్షలు ఇస్తున్నారని సమాచారం. నాగబాబు, రోజా లతో పోలిస్తే వేళ్ళకు ఇస్తున్నది సగం. పారితోషకాలలో ఇంతగా మార్పులు రావటానికి కారణాలు ఏమిటో అంతుచిక్కడంలేదు ఎవరికి. ఒకప్పుడు జబర్దస్త్ లో ప్రేక్షకులను అలరించిన వేణు, ధన్రాజ్, వంటి కమెడియన్స్ షోను విడిచి వెళ్ళటం వలన జబర్దస్త్ పాపులారిటీ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇది కూడా ఒక కారణం కావొచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.

ఒకప్పుడు టాప్ కమెడియన్ గా వెలిగిన కృష్ణ భగవాన్ కు ఇప్పుడు సినిమా అవకాశాలు కాస్త సన్నగానే ఉన్నాయ్. ఇంద్రజాది కూడా ఇదే పరిస్థితి. ఒకప్పుడు టాప్ హీరోస్ తో నటించిన ఈమె ప్రస్తుతం సినిమాలలో చిన్న చిన్న పత్రాలు చేస్తుంది. తాజాగా ఈమె ఉగ్రం, మాచర్ల నియోజకవర్గం, స్టాండ్ అప్ రాహుల్ వంటి చిత్రాలలో నటించారు. సినిమాలలో నటిస్తూనే బుల్లితెర కి కూడా ప్రాధాన్యం ఇస్తోంది ఈ హీరోయిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: