టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ నటుల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ నటుడు తన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి చాలా తక్కువ సంవత్సరాలు అవుతున్నప్పటికీ 
ఇప్పటికే అనేక సినిమాలలో హీరోగా నటించాడు. అందులో భాగంగా రాజా వారు రాణి గారు ... ఎస్ ఆర్ కళ్యాణమండపం ... సమ్మతమే ... వినరో భాగ్యమ విష్ణు కథ అనే మూవీ లతో పరవాలేదు అనే రేంజ్ విజయాలను కూడా ఈ నటుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను ముందుకు కొనసాగిస్తున్నాడు. 

ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటుడు మీటర్ అనే పవర్ఫుల్ యాక్షన్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు "రూల్స్ రంజన్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డీజే టిల్లు ఫెమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి రతీనం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఆగస్టు 18 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: