ఈ ఏడాది వచ్చిన మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి. 50 కోట్ల మార్కెట్ కూడా లేని మెగా మేనల్లుడిని ఏకంగా 100 కోట్ల హీరోను చేసింది ఈ సినిమా. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చింది. మొదటి సినిమాతోని ఒక రేంజ్ లో పాపులారిటీని దక్కించుకున్నాడు ఈ దర్శకుడు. మొదటి సినిమాకి ఆ స్థాయిలో అవుట్ ఫుట్ ఇచ్చాడు అంటే మామూలు విషయం కాదు. ప్రి పోస్టర్ నుంచి ఈ సినిమాపై ఒక మంచి హైట్ ను క్రియేట్ చేశారు ఈ దర్శకుడు. ఇక టీజర్ ట్రైలర్లు కూడా ఓహో అనే రేంజ్ లో ఉండడంతో

ఆటోమేటిక్గా విరూపాక్ష సినిమాపై ఎక్కడా లేని బస్ ఏర్పడింది. ప్రేక్షకుల అంచనాలకు మించేట్టుగానే ఈ సినిమాని ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించాడు కార్తీక్ దండు .ఇక ఆయన టేకింగ్ విజన్ కు సుకుమార్ బలం తోడవడంతో ఈ సినిమా ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మెగా మేనల్లుడు సైతం ఈ సినిమాలో తన నటనతో వేరే లెవెల్ కి ఈ సినిమాని తీసుకెళ్లారు. బి బి ఎస్ ఎన్ ప్రసాద్  ఈ సినిమాను నిర్మించారు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు నిర్మాతలు. కాగా ఇప్పుడు ఈ ట్రయో మరో

 సినిమా కోసం చేతులు కలిపినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు మరియు సుకుమార్ బివిఎస్ఎన్ ప్రసాదు కలిసి మరొక సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఒక పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఏదో అన్వేషణలో భాగంగా ముగ్గురు వ్యక్తులు గుహల్లో వేలాడుతున్నట్టుగా ఆ పోస్టర్ను చాలా అద్భుతంగా డిజైన్ చేసి విడుదల చేశారు మేకర్స్. తనకు సక్సెస్ ఇచ్చిన థ్రిల్లర్ జానర్ కి కార్తీక్ దండు మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాకపోతే ఈసారి దానికి మైథాలజిని యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. మిగిలిన విషయాలను కూడా త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు మేకర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: