ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సలార్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని హోం బలే ఫిలిం బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులకు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ప్రభాస్ కు కూడా ఈ సినిమా సక్సెస్ ఇస్తుందని చాలా నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరో రెండు నెలల ఈ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తున్నారు.



సలార్ సినిమా ట్రైలర్ ఈ నెలలో రాబోతోందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.  రిలీజ్ సమయం కూడా దగ్గర పడుతూ ఉండడంతో ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా బిగ్గెస్ట్ రిలీజ్ గా కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది.. విలన్ గా మలయాళం నటుడు నటిస్తూ ఉన్నారు. ఇదివరకే యూఎస్ఏ లో ఈ సినిమా బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతూ ఉండగా ఇప్పుడు యూఎస్ మార్కస్ థియేటర్లో చైన్ అన్నిటిని కూడా సలార్ సినిమా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

సలార్ మేనియా ఇప్పుడు ప్రపంచం మొత్తం స్టార్ట్ కాబోతోంది.. సెప్టెంబర్ 28న చాలా గ్రాండ్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లోనే బాహుబలి తర్వాత మళ్లీ అంత రేంజ్ లో హిట్ అందుకుంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. సలార్ సినిమాకు సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రభాస్ స్పిరిట్ అనే సినిమాని తెరకెక్కించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: