‘బేబి’ మ్యానియా  ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ లాంటి పెద్ద సినిమాను కూడ వెనక్కి నెట్టి ‘బేబీ’ నిలబడటంతో ఆమూవీ బయ్యర్లకు కనక వర్షం కురిసింది. ఇక ఈనెలలో విడుదలైన రజనీకాంత్ జైలర్ కలెక్షన్స్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. గతవారం ఏకంగా నాలుగు సినిమాలు విడుదలలైనప్పటికి ఆ నాలుగు సినిమాలలో ఏఒక్క సినిమా సగటు ప్రేక్షకులకు సంతృప్తి ని ఇవ్వలేక పోయింది.  



ఆ నాలుగులో ‘బెదురులంక 2012’ పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్నప్పటికీ   ఆ సినిమా హడావిడి కూడ అంతా అంతంత మాత్రమే ‘గాండీవధారి’ ‘అర్జున’ దుల్కర్ మూవీ వాషౌట్ అయిపోయాయి. దీనితో ‘జైలర్’ హడావిడి ‘ఖుషి’ విడుదల అయ్యేంత వరకు కొనసాగే ఆస్కారం  కనిపిస్తోంది. ఈచిత్రం పై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. అదిరిపోయే పాటలు సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చాయి.



ట్రైలర్ కూడ  అందరికీ బాగా నచ్చడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్   విషయంలో అంచనాలు బాగానే ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం ‘లైగర్’ ఫ్లాప్ సమంత లాస్ట్ మూవీ ‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్లు అయినప్పటికీ వాటి ఎఫెక్ట్ ‘ఖుషి’ మూవీ బిజినెస్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదు.    ఈ మూవీకి సంబంధించి బాక్సాఫీస్ దగ్గర కూడా ఎటువంటి పోటీ లేకపోవడంతో పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ కలెక్షన్స్ సునామీ ఆకాశాన్ని తాకడం ఖాయం అన్న అంచనాలు ఉన్నాయి.    



అయితే ఇలాంటి భారీ అంచనాల మధ్య లేటెస్ట్ గా విడుదల అయిన చిరంజీవి ‘భోళా శంకర్’ ఘోరమైన ఫ్లాప్ టాక్ ను మెగా అభిమానులు కూడా ఏమాత్రం తప్పించ లేక పోయారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులు ఈ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికిఎంతవరకు ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ కి సగటు ప్రేక్షకుడుకి నచ్చి హిట్ టాక్ ను తెచ్చి పెడుతుంది అన్న ఆశక్తి ఇండస్ట్రి వర్గాలలో ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: