సంక్రాంతి వస్తోందంటే చాలు థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా మామూలుగా ఉండదు.. ముఖ్యంగా తమ హీరోల సినిమా విడుదల అవుతున్నాయి అంటే చాలు నానా హంగామా చేస్తూ ఉంటారు.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు థియేటర్స్ వద్ద బాగానే సందడి చేశాయి.. అయితే అనుకోకుండా వారసుడు సినిమా కూడా విడుదల భారీగానే ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్న సినిమాల పరిస్థితి ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి రేసులో నిలువబోతున్నట్లు తెలుస్తోంద.. అందులో ముఖ్యంగా మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా రవితేజ నటిస్తున్న ఈగల్... విజయ్ దేవరకొండ నటిస్తున్న 13వ సినిమా హీరో తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ సినిమా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.. అంతేకాకుండా నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది. దీంతో ఈ ఐదు సినిమాలు సంక్రాంతికి రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక వీటితోపాటు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కూడా పండుగకి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి.. అయితే ఈ సినిమా జూన్ జూలైకి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.. అయితే ఈ సినిమాలకి తోడుగా ఇతర భాషలనుంచి కూడా రెండు మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే ఈసారి థియేటర్ల కోసం చాలామంది నిర్మాతలు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయి సందర్భంగా థియేటర్ల వద్ద కూడా చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంటుంది మరి సంక్రాంతికి సినిమాల పరిస్థితి ఏంటో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: