లేడీ జబర్దస్త్ కమెడియన్ రీతూ చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల ఆమె తన అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చింది. తన సోషల్ మీడియా వేదికగా తన పెళ్లికి సంబంధించిన వీడియో నీ షేర్ చేసింది ఆమె. అయితే ఈమె ప్రేమ పెళ్లి పై ఎప్పుడు సోషల్ మీడియాలో కన్ఫ్యూజన్ ఉండనే ఉంటుంది. అయితే ఈమె గతంలో శ్రీకాంత్ అనే ఒక వ్యక్తిని ప్రేమికుడిగా పరిచయం చేసింది. వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక వీరు రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు అన్న ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించింది. నిజాలు మాట్లాడుకుందాం అని పేరుతో తన అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది ఆమె. ఈ నేపథ్యంలోనే కొందరు ఆమెను వ్యక్తిగత ప్రశ్నలు కూడా అడిగారు. ఒకరు మీకు పెళ్లెప్పుడు అని అడిగారు. ఇక దానికి డోంట్ మ్యారీ బి హ్యాపీ అన్న సమాధానాన్ని ఇచ్చింది. పెళ్లి వలన కష్టాలే వివాహం చేసుకోవద్దు అన్న అర్థంతో ఆమె ఈ కామెంట్లని చేసింది. మరొక రోజు శ్రీకాంత్ అన్న తో మాట్లాడడం లేదా అని అడిగారు. దానికి సమాధానం గా లేదు అన్న ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఆమె.

మరి ఎప్పుడైనా దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం అని అంది. ఇక మరొకరు నీకు లవర్ ఉన్నాడా అని అడగ్గా దండం సింబల్ ని పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె సమాధానాలని చూసిన వారందరూ ఆమె ప్రియుడితో తనకి బ్రేకప్ అయ్యింది కావచ్చు అని అంటున్నారు. అయితే అనూహ్యంగా శ్రీకాంత్తో ఉన్న ఫోటోలను రీతూ చౌదరి షేర్ చేసింది. సదరు రొమాంటిక్స్ ఫోటోకు సీతాకోకచిలుకల ఇమేజి కూడా జోడించింది. అయితే ఇప్పుడు మరొక షాక్ ఇచ్చింది ఆమె. శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో పంచుకున్న కొద్ది రోజుల్లోనే తన పెళ్లికి సంబంధించిన వీడియో ని కూడా షేర్ చేసింది. ఇక అందులో తనకి మంగళ స్నానం చేస్తున్నారు. పెళ్లికూతురు లాగా పసుపు పూసి తనకి స్నానం చేయిస్తుండడంతో ఒకసారి అందరు షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: