‘ఖుషీ’ మూవీకి రివ్యూలు ఎలా వచ్చినప్పటికీ ఆసినిమా కలక్షన్స్ సంతృప్తికరంగా ఉండటంతో వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండ ఫ్లాప్ ల పర్వానికి ‘ఖుషీ’ బ్రేక్ ఇచ్చింది అనుకోవాలి. దీనితో విజయ్ దేవరకొండతో పాటు అతడి అభిమానులు కూడ మంచి జోష్ లో ఉన్నాడు.


సాధారణంగా చాలమంది టాప్ హీరోలు అభిమానులు తమ దేవుళ్ళు అని  వారు లేకుంటే తాము లేము అని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. అయితే విజయ్ దేవరకొండ తన అభిమానుల విషయంలో డిఫరెంట్ గా వ్యవహరించడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘ఖుషీ’ విజయంలో తన అభిమానుల పాత్ర కూడ ఉంది అని గ్రహించిన విజయ్ కోటి రూపాయలు తన అభిమానులకు బహుమతిగా ఇస్తున్నాడు.


తన అభిమానులలో నిజమైన ఆర్థిక అవసరాలు ఉన్న దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 100 మంది అభిమానులను ఎంపిక చేసి వారి కుటుంబ అవసరాల కోసం ప్రతి కుటుంబానికి ఒక లక్ష చొప్పున ఇచ్చే విధంగా విజయ్ ఆర్థిక సహాయం ఉండబోతోంది. ఇప్పటికే ఈ యంగ్ హీరో ఈ విషయానికి సంబంధించి కొన్ని ప్రాధమిక చర్చలు జరిపి ఈ బాధ్యతను ఒక సంస్థకు సమర్థవంతంగా నిర్వహించడానికి అప్పచెప్పినట్లు తెలుస్తోంది.


తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో అభిమానులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారిని ఆడుకునే విషయంలో పవన్ కళ్యాణ్ చాల పెద్ద మనసుతో వ్యవహరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆవిషయాన్ని విజయ్ దేవరకొండ ఆదర్శంగా తీసుకుని తన అభిమానులలో తన బలాన్ని పెంచు కుంటున్నాడు అనుకోవాలి. తెలుగు రాష్ట్రాలలో మంచి టాక్ ను తెచ్చుకుని కలక్షన్స్ విషయంలో సంతృప్తికరంగా ఉన్న ‘ఖుషీ’ పాన్ ఇండియా మూవీగా విడుదల అయినప్పటికీ ఆమూవీ పట్ల స్పందన బాలీవుడ్ లో అదేవిధంగా తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలలో అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో విజయ్ పాన్ ఇండియా హీరో కల ఇంకా నెరవేరలేదు అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: