
ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కి వంక పెట్టాల్సిన అవసరమే లేదు. ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన ఏఆర్ రహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే అది ఏ హీరో సినిమా అయినా సరే అది మ్యూజికల్ గా హిట్ అనే చెప్పుకోవాలి. తాజాగా నాని కొత్త సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ ను సెలెక్ట్ చేసుకున్నారట. అయితే.. ఆ సినిమాకు పని చేయడానికి ఏఆర్ రహమాన్ 10 కోట్లు డిమాండ్ చేశాడట.మ్యూజిక్ డైరెక్షన్ కే ఏఆర్ రహమాన్ 10 కోట్లు అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాలేదట ఆ సినిమా నిర్మాత డీవీవీ దానయ్యకు. ఎందుకంటే ఆ సినిమాకు ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి. ఏది ఏమైనా 10 కోట్లు డిమాండ్ చేయడం ఎక్కువే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.నాని సినిమాకి భారీగా డిమాండ్ చేస్తున్న ఏఆర్ రహమాన్.. ఆ సినిమాకు మ్యూజిక్ కోసం రూ.10 కోట్లు అడిగారా?
ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించనున్నారు. అంటే సుందరానికి అనే సినిమాకు దర్శకత్వం వహించింది కూడా ఆయనే. మళ్లీ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా అది. ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రహమాన్ కావాలని డైరెక్టర్, హీరో నాని పట్టుబడుతున్నారట. దీంతో డీవీవీ దానయ్యకు ఏం చేయాలో అర్థం కావడం లేదట. ఆయన ఎక్కువ డిమాండ్ చేస్తుండటంతో డీవీవీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా వెయిట్ చేస్తున్నారు.