
వీటితో పాటుగా ఈ విషయం పైన మాట్లాడుతూ ప్రస్తుతానికి నవదీప్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ అందుబాటులో లేరని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని ఆయన పరారీలో ఉన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇదే విషయం మీద హీరో నవదీప్ ని ఒక ప్రముఖ ఛానల్ సంప్రదించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే నవదీప్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో వాట్సాప్ కాల్ చేయగా నవదీప్ అందుబాటులోకి వచ్చినట్లుగా సమాచారం.. అసలు ఈ డ్రగ్స్ వ్యవహారం గురించి తనకి అసలు తెలియదని ఈ డ్రగ్స్ కేసులు ఏమాత్రం తనకు సంబంధం లేదని కూడా తెలియజేశారట.
తాను హైదరాబాద్ విడిచి ఎక్కడికి పారిపోలేదని ప్రస్తుతం హైదరాబాదులోనే లవ్ మౌళి అనే ఒక కొత్త సినిమాకు సంబంధించి సాంగ్ లాంచ్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అంతేకాకుండా తాను కూడా ప్రెస్ మీట్ చూశానని ఆనంద్ హీరో నవదీప్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా అంటూ తెలియజేశారు. ఇక వేరే నవదీప్ కూడా అయి ఉండవచ్చు అంటూ తెలియజేసినట్లు సమాచారం. అయితే సివి ఆనంద్ ప్రస్తావించింది మీ గురించే అని ఆయన దృష్టికి తీసుకువస్తే తనకు ఈ కేస్ కు ఏమాత్రం సంబంధం లేదంటూ తెలియజేశారు. అంతేకాకుండా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా స్పందించినట్లు తెలుస్తోంది.అది నేను కాదు జెంటిల్మెన్ నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి అంటూ రాసుకొచ్చారు.