టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య విడిపోయి రెండేళ్లు దాటిపోతుంది. ఇప్పటికీ వీళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అన్నదాని పై క్లారిటీ మాత్రం రాలేదు. అయితే ఈలోపే మళ్లీ వీళ్ళిద్దరూ కలవబోతున్నారు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక సమంత నాగచైతన్య 2017 లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి రోజు క్రైస్తవ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత సమంత తన పేరుని అక్కినేని అని మార్చుకుంది. అలాగే తన సోషల్ మీడియా వేదికగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలోని సైతం షేర్ చేసింది.

అయితే ఉన్నట్టుండి 2021 జూలై 30 1 న ఆమె తన సోషల్ మీడియా లో అక్కినేని అనే తొలగించేసింది. దాని తరువాత వారు విడిపోతున్నారు అని సైతం ప్రకటించింది. ఇక అప్పట్లో వీరిద్దరి విడాకులు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగచైతన్య కి సంబంధించిన  ఫోటోలని తొలగించేసింది సమంత. అప్పటికే టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ గా ఉన్న వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో వీరి అభిమానులు అందరూ షాక్ అయ్యారు. అంతేకాదు మల్లి వీరిద్దరూ కలిస్తే బావుండు అని అప్పటినుండి ఇప్పటివరకు కోరుకుంటున్నారు.

 విడాకులు తీసుకున్న కొద్దిరోజుల తర్వాత నాగచైతన్య మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అని.. నటి శోభిత దూళిపాల తో ఆయన డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. వాటిని కొట్టి పారిస్తూ వస్తున్న నాగచైతన్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే దానికి ముఖ్య కారణం సమంతాతను సోషల్ మీడియాలో డిలీట్ చేసిన వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలని మళ్లీ ఇప్పుడు రికవరీ చేసింది. ఆ ఫోటోలని తిరిగి తీసుకురావడంతో ఇప్పుడు ఈ సందేహాలు నెలకొన్నాయి. నిజంగానే వీరిద్దరు కలిసిపోతే బాగుండు అని ఈ విషయం తెలిసిన వారందరూ కోరుకుంటున్నారు. అలా ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వారు అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: