
ఈ సినిమా యూఎస్ఏ లోని మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా అలాంటి తాకిన సొంతం చేసుకున్న కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఏకంగా ఈ సినిమా 16 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చింది. వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిందని చెప్పవచ్చు. గాండీవధారి అర్జున సినిమా పైన నెలకొన్న అంచనాల కారణంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రిమ్మింగ్ హక్కులకు తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటి దిగ్గజ సమస్త నెట్ఫ్లిక్స్ ఈ సినిమా రైట్స్ భారీ ధరకే కొనుగోలు చేసినట్లు సమాచారం.
ఈ సినిమా ఓటీటి 30 రోజుల తరువాతే ఉంటుందని నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. సెప్టెంబర్ 24న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రా బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో హీరోయిన్ల సాక్షి వైద్య నటించగా విమల రామన్ ,నాజర్ అభినవ్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటించారు. మిక్కీ జేయర్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వరుణ్ తేజ్ అభిమానులను నిరాశపరిచింది. ఇప్పుడు తాజాగా మరొక థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.