తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని తాజాగా స్కంద అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ ని దర్శకుడు బోయపాటి శ్రీను యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్న వారి లిస్ట్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన లిస్ట్ ప్రకారం ఈ మూవీ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిలిం సంస్థ దక్కించుకుంది. అలాగే వైజాక్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు ... సీడెడ్ హక్కులను ఎస్ ఆర్ ఆర్ ఫిలిమ్స్ వారు ... ఈస్ట్ హక్కులను శ్రీలత ఫిలిమ్స్ సంస్థ వారు ... కృష్ణ హక్కులను జీ 3 సంస్థ వారు ... గుంటూరు హక్కులను వి ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ..  నెల్లూరు హక్కులను అంజలి పిక్చర్స్ సంస్థ వారు దక్కించుకున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: