టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కొంత కాలం క్రితం ది వారియర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. తమిళ దర్శకుడు లింగు సామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటించగా ... కృతి శెట్టి హీరోయిన్ పాత్రలో నటించింది. భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.

ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు స్కంద అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. 

ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా హీరో అయినటువంటి రామ్మూవీ ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన తెలుగు బిగ్ బాస్ షో కి ముఖ్య అతిథిగా కూడా విచ్చేశాడు. అలాగే పలు టీవీ షో లకు కూడా వరుసగా ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: