ఈ వారం కొన్ని సినిమాలు ధియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ మరియు రన్ టైమ్ వివరాలు తెలుసుకుందాం.

స్కంద : రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 47 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చంద్రముఖి 2 : రాఘవ లారెన్స్ హీరోగా పి వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కంగానా రనౌత్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పెద్దకాపు 1 : శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 29 నిమిషల నడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది వ్యాక్సిన్ వార్ : ఈ మూవీ.ని ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి యు సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 41 నిమిషాల నిమిషల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపోతే ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: