అయితే ఆ తర్వాత కాలంలో నేటి తరానికి దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇప్పుడు నటనకు నిలువెత్తు రూపంగా రానా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే తర్వాత కాలంలో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కొంతమంది హీరోలుగా ఎంట్ర ఇచ్చిన అడపా దడప్ప సినిమాలు మాత్రమే చేశారు. పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయారు. అలాంటి వారిలో దగ్గుబాటి ఫ్యామిలీలో హీరో వెంకటేష్ తమ్ముడు కూడా ఉన్నాడు అని చెప్పాలి. అయితే వెంకటేష్ తమ్ముడు చాలా మంది సినీ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.
80, 90 లలో తెలుగు కన్నడ తమిళ మలయాళ సినిమాల్లో నటించిన ఆయన అప్పట్లో ప్రేక్షకులను అలరించారు. ఆయన పేరు దగ్గుబాటి రాజా. ఈయనను రామానాయుడు తెరమీదకి తీసుకొచ్చారు. 1981లో పాత్తువేతలై అనే తమిళ చిత్రంతో నటించిన ఆయన తెలుగులో సంకెళ్లు, ఏడుకొండలస్వామి, ఝాన్సీ రాణి, సిరిపురం చిన్నోడు లాంటి సినిమాలో నటించారు. ఆ తర్వాత పెద్దగా గుర్తింపు రాకపోవడంతో సినిమాల్లో కనిపించలేదు. మళ్లీ 2019లో క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ కథనాయకుడు సినిమాలో స్క్రీన్ పై తలుక్కున మెరపడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఇప్పుడు రెండు సంవత్సరాల గ్యాప్ ఇచ్చి బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కందా మూవీతో తెరమీద కనిపించారు. హీరో రామ్ తండ్రి పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అయితే సినిమా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన రాజా బాగా సెటిల్ అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి