ఒక్కసారిగా చిన్న సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల కావడంతో గత శుక్రువారం విడుదల అయిన మీడియం రేంజ్ చిన్న సినిమాలకు ఏఒక్కటి అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాయి. ఈ చిన్న సినిమాలలో కొంతవరకు ‘మ్యాడ్’ ఒక మోస్తరి విజయాన్ని సాధించినప్పటికీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యానియా మధ్య ఈ చిన్న సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లు వార్తలు రావడం లేదు.



ఈ పోటీలో కలర్స్ స్వాతి నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ మూవీకి సరైన టాక్ రాకపోవడంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రయత్నం వృధా అయినట్లే కనిపిస్తోంది. కలర్స్ స్వాతి ఉంది కాబట్టి సినిమా బాగుంటుంది అని ఆశతో వెళ్ళిన సగటు ప్రేక్షకులకు నిరాశ ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి.



వైజాగ్ లో ఉండే మధుసూదన్ హీరో నవీన్ చంద్ర ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకుని విడాకుల నోటీసు పంపించిన భార్య లేఖ కలర్స్ స్వాతి మనసు మారి తన దగ్గరికి వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండలేక తాగుడుకి అలవాటు పడతాడు. ఈనేపధ్యంలో విదేశాల నుంచి వచ్చిన మధు శ్రేయ మధుసూదన్ కి పరిచయమవుతుంది. ఈ ముగ్గురి లైఫ్ జర్నీ ఏరకంగా వారి జీవితాలలో వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది అన్న సున్నితమైన పాయింట్ చుట్టూ ఈసినిమాను నడిపించినప్పటికి ఆమూవీ అటు క్లాస్ ప్రేక్షకులకు కాని ఇటు యూత్ కు కాని ఏమాత్రం నచ్చలేదు అన్నవార్తలు వస్తున్నాయి.



సాగదీసిన సన్నివేశాలు ఎక్కువ అవ్వడంతో ఈ మూవీ చూసిన ప్రేక్షకులు భారంగా నిట్టూర్పులు విడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  సినిమా కధలో అదేవిధంగా స్క్రీన్ ప్లే లో కొత్త దనం లేకపోతే నటీనటులు ఎంత బాగా నటించినా వృథానే అవుతుంది అన్న పాయింట్ కు ఉదాహరణ ఈమూవీ. ఇది ఇలా ఉండగా ఈసినిమాను  చూసిన  సగటు ప్రేకశకుడు బాగా ఓపిక తీరిక ఉంటేనే ‘మంత్ ఆఫ్ మధు’ ను చూడవచ్చు అని కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: