ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగువెలిగిన  జగపతి బాబు ఆతరువాత  వచ్చిన వరస  ఫ్లాప్ లతో అతడి కెరియర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ‘లెజెండ్’ మూవీ అతడికి ఊహించని  బ్రేక్ ఇవ్వడంతో విలన్  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతడి సెకండ్ ఇన్నింగ్స్  అద్భుతంగా నడిచింది.



ప్రస్తుతం టాలీవుడ్ లో మాత్రమే కాదు దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయిలో కొనసాగుతున్నాడు. భారీ  బడ్జెట్ సినిమా దగ్గర నుంచి మీడియం రేంజ్ సినిమా వరకు మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ గా తన ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. జగ్గు భాయ్ అంటూ అతడి అభిమానులు అభిమానంగా పిలుచుకుంటారు. తన బలహీనతల గురించి అదేవిధంగా సామాజిక రాజకీయాల గురించి ఇలా ఏవిషయం పై అయినా ఓపెన్ గా మాట్లాడే జగిపతి బాబుకు మనస్థాపం ఎందుకు కలిగిందో తెలియదు.  



ఈమధ్య జగపతి బాబు తన అభిమాన సంఘాలకు గుడ్ బై  చెప్పి షాకింగ్  నిర్ణయం తీసుకున్నాడు. ఈమధ్య అతడు సోషల్ మీడియాలో పోస్ట్  చేసిన లేఖ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. “33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగా నా అభిమానులు కూడా నా ఎదుగుదలకు ముఖ్యకారణంగా నిలిచారు. అలాగే వాళ్ళ ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ళ కష్టాన్ని నాకష్టాలుగా భావించి నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్ళని నమ్మాను. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు నా నుంచి ప్రేమకంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెబుతున్న విషయం ఇది. ఇక నుంచి నేను నా అభిమాన సంఘాలకు ట్రస్ట్ లకు సంబంధం లేదు. వాటి నుంచి విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను”.  అంటూ అతడు షేర్ చేసిన లెటర్  చదివిన వారు జగపతి బాబు ఇలాంటి  నిర్ణయం ఎదుకు తీసికున్నాడు  అంటూ  షాక్  అవుతున్నారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: