సీనియర్ హీరోలలో చిరంజీవి  బాలకృష్ణ ల తరువాత 100వ సినిమా  లాండ్ మార్క్ కు వెండితెర మన్మధుడు నాగార్జున అతి దగ్గరలో ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించి ‘గాడ్ ఫాదర్’ ఫేమ్ మోహన్ రాజా కు ఓకే చెప్పాడనే ప్రచారం ఇప్పటివరకు జరిగింది.


అయితే ఆ  దర్శకుడు ఇప్పుడు తని ఒరువన్ 2 ప్రాజెక్ట్ పనులు ప్రారంభించడంతో నాగార్జున 100వ సినిమా ప్రాజెక్టు నుండి అతడు తప్పుకున్నాడు అన్న  లీకులు వస్తునాయి. ఈ పరిస్థితులు  ఇలా  ఉండగా నాగ్  100వ సినిమాకు  సంబంధించి మరో  కొత్త దర్శకుడి  పేరు  ప్రచారంలోకి  వచ్చింది. కోలీవుడ్  దర్శకుడు నవీన్ చెప్పిన స్టోరీ లైన్  నాగార్జునకు నచ్చడంతో అతడికి నాగ్ తన 100 సినిమా  అవకాశం  ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోం.  


తమిళ దర్శకుడు నవీన్ ఈప్పటివరకు తీసిన ఈసినిమాలు కేవలం 2 మాత్రమే అతడు తీసిన మొదటి సినిమా 2013లో వచ్చిన ‘మూడర్ కుడం’  ఆ సినిమాకు  మంచి పేరు వచ్చింది. ఆతర్వాత ఈ మూవీ దర్శకుడు 2021లో విజయ్ ఆంటోనీ అరుణ్ విజయ్ హీరోలుగా ‘అగ్ని సిరగుగల్’ అనే మూవీ తీసాడు. అయితే ఆమూవీ ఇప్పటివరకు  విడుదలకాలేదు.


నిర్మాతగా రచయితగా పేరున్న నవీన్ కధలు చాల డిఫరెంట్ గా  ఉంటాయి. అయితే సక్సస్ పరంగా సరైన ట్రాక్ రికార్డు లేని ఈ దర్శకుడిని నాగార్జున ఎలా నమ్మాడు  అంటూ  కొందరు  షాక్  అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ దర్శకుడి  చెప్పిన  కధకు  సంభంధించి  స్క్రిప్ట్  వర్క్  జరుగుతూ ఉండగానే నాగ్ తన 100వ సినిమాకు సంబంధించి  మరికొందరు  దర్శకులు  చెపుతున్న కధలను  కూడా  వింటున్నట్లు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ తాము నటించిన సినిమాల్లో ‘మనం’ మూవీని క్లాసిక్ గా భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం నాగార్జున ‘బిగ్ బాస్’ సీజన్-7 హోస్ట్ చేస్తూ ఆ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ రావాడానికి తన వంతు కృషి చేస్తున్న విషయం తెలిసిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: