ఎవరికోసమో ఎదురు చూస్తున్న భావన చూసేవారికి ఆమె కళ్ళల్లో కనిపిస్తోందని చెప్పవచ్చు. నిహారికలోని కొత్తకోణం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే నిహారిక విషయానికి వస్తే.. ఎన్నో వ్యతిరేకతల మధ్య యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మారిన ఈమె నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిహారిక హీరోయిన్ కావడానికి ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు పూర్తిగా వ్యతిరేకించారు.
అయినా సరే తన కోరికను మాత్రం నెరవేర్చుకుంది. హీరోయిన్ గా తెలుగులో మూడు చిత్రాలు తమిళంలో ఒక చిత్రంలో నటించిన ఈమె చిరంజీవి పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి లో గెస్ట్ రోల్ కూడా చేసింది. ఇక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో తన తండ్రి నాగబాబు కోరిక మేరకు వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్న కొన్ని రోజులకి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తర్వాత స్నేహితులతో కలిసి పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా సమయం దొరికితే చాలు వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోందని చెప్పవచ్చు. ఇక ఈమె ఫోటోలకు ఫిదా అవ్వని అభిమాని ఉండరని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఏది ఏమైనా నిహారిక షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి